మరోసారి తమన్నా గ్లామర్ షో

కెరీర్ మొత్తం గ్లామర్ షోలో పొదుపు పాటిస్తూ వచ్చిన స్టార్ హీరోయిన్ తమన్నా…ఇటీవల ఆ హద్దులు దాటేసి బోల్డ్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా జీ కర్దా అనే వెబ్ సిరీస్ లో తమన్నా రొమాంటిక్ సీన్స్ చేయడంలో బౌండరీస్ దాటేసింది. ఆ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమన్నా ఇలా నటిస్తుందా? అని అంతా ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా మరో వెబ్ సిరీస్ లోనూ తమన్నా గ్లామర్ షో యూత్ కు కిక్ ఇస్తోంది.

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఆఖరి సచ్ లో తమన్నా అన్య క్యారెక్టర్ లో నటించింది. ఈ క్యారెక్టర్ లో తమన్నా నటించిన బోల్డ్ డ్రెస్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా కేవలం గ్లామర్ షో కే పరిమితం కాకుండా మంచి పర్మార్మెన్స్ ఉన్న పాత్రలో నటించిందనే ప్రశంసలూ దక్కుతున్నాయి. రాబీ గ్రీవాల్ దర్శకత్వం వహించిన ఆఖరి సచ్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.