“గేమ్ ఛేంజర్”…చేయాల్సింది చాలానే ఉందట

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వినిపిస్తున్న విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా పార్ట్ మిగిలే ఉందట. దాదాపు 100 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని అంటున్నారు. ఇంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఇక ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ కు రెడీ అవగలదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2021 సెప్టెంబర్ 8న గేమ్ ఛేంజర్ షూటింగ్ ముహూర్తం పెట్టుకుంది. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక అప్పటి నుంచి దఫ దఫాలుగా ఈ సినిమా చిత్రీకరణ చేస్తూనే వస్తున్నారు. ఆ మధ్య రాజమండ్రిలో షూటింగ్ జరిపారు. పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్లారు. రీసెంట్ గా హైదరాబాద్ లోని వివిధ లొకేషన్స్ లో చిత్రీకరణ మొదలుపెట్టారు. అయినా షూటింగ్ ఇంత భారీగా బ్యాలెన్స్ మిగిలి ఉండటం సర్ ప్రైజింగ్ గా ఉంది.

అందుకేనేమో ఇటీవల దిల్ రాజు గేమ్ ఛేంజర్ అప్ డేట్ దర్శకుడు శంకర్ చెబితే ఇస్తామని అన్నారు. ఈ సినిమా రిలీజ్ ను ఈ ఇయర్ డిసెంబర్ లో అనుకున్నారు. ఆ తర్వాత ఆ తేదీని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకెళ్లారు. అప్పటికీ గేమ్ ఛేంజర్ రిలీజ్ కాదని తేల్చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పూర్తి అనిశ్చితి నెలకొని ఉంది.