బాలీవుడ్ బ్యాడ్ టైమ్ ముగిసిందేమో. అందుకే రిలీజైన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో దిగాలుపడింది హిందీ చిత్రపరిశ్రమ. ఒక్క హిట్ వస్తే చాలనుకుంది. అక్కడి స్టార్స్, డైరెక్టర్స్ అంతా సౌత్ సినిమాలను చూసి నేర్చుకోవాలి అనుకునేంతగా బాధపడ్డారు. కానీ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ కు వరుసగా సూపర్ హిట్స్ దక్కుతున్నాయి. ఇటీవల సత్య ప్రేమ్ కి కథ, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కథ, ఓ మై గాడ్ 2, గదర్ 2 వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా వీటికి మరో హిట్ చేరింది.
ఆయుశ్మాన్ ఖురానా, అనన్య పాండే జంటగా నటించిన డ్రీమ్ గర్ల్ 2 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో రిలీజై సక్సెస్ కొట్టిన డ్రీమ్ గర్ల్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా అంతా ఫన్, జోక్స్ తో సాగుతూ నవ్వించిందని ఆడియెన్స్ చెబుతున్నారు. క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయుశ్మాన్ ఖురానా, అనన్య పాండే బాగా నటించారు. దర్శకుడిగా రాజ్ శాండిల్య ప్రతిభను డ్రీమ్ గర్ల్ 2 చూపించింది. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు థియేటర్స్ లో కలెక్షన్స్ దుమ్మురేపుతున్న గదర్ 2, ఓ మై గాడ్ 2 సినిమాల మీద ప్రభావం పడనుంది.