ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డ్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అల్లు అర్జున్ ను అభినందిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ కు అభినందనలు తెలియచేశారు. అల్లు అర్జున్ బావా.. కంగ్రాచ్యూలేషన్స్.. పుష్ప సినిమాకు గాను ఈ అవార్డ్ కు నీవు అర్హుడివి అంటూ ట్వీట్ చేశాడు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ఉప్పెన టీమ్‌కు, ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న అలియాభట్కూ తారక్ అభినందనలు తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు జాతీయ అవార్డులు దక్కించుకుంది. అవార్డులు దక్కించుకున్న వారితో సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. బన్నీ, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఉత్తమ నటుడు అవార్డ్ పోటీలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. అయినప్పటికీ తన మిత్రుడుకు అవార్డ్ రావడం పట్ల ఇలా స్పందించడం నిజంగా అభినందనీయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ అవార్డ్ రావడంతో బన్నీ రేంజ్ మరింత పెరిగింది. అలాగే పుష్ప 2 పై మరింతగా అంచనాలు పెరిగాయి.