స్నేహితులతో సెలబ్రేషన్ మూడ్ లో చేతిలో షాంపేన్…పక్కనున్న వైఫ్ తో ఫన్ చేస్తూ విప్లవ్ పార్టీ చేసుకుంటున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు ‘ఖుషి’ టీమ్. ఈ సినిమాలోని ఐదో పాట ఓసి పెళ్లామా లిరికల్ సాంగ్ లోనిదీ స్టిల్. ఈ నెల 26న ఓసి పెళ్లామా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు ‘ఖుషి’ మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన నాలుగు లిరికల్ సాంగ్స్ నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి టైటిల్ సాంగ్, యెదకే ఒక గాయం ఛాట్ బస్టర్స్ అయ్యాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఆకర్షణ కానుందని ఈ పాటల సక్సెస్ చెబుతోంది.
ఇక ఇప్పుడు ఐదో పాట ‘ఓసి పెళ్లామా..’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 26న ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఓసి పెళ్లామా..’ పాట అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో షాంపేన్ తో విప్లవ్ తన ఫ్రెండ్స్ ను ఉత్సాహపరుస్తున్న మూమెంట్ ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.