బాక్సాఫీస్ వసూళ్లు, బుకింగ్స్ రేంజ్ ను బట్టి స్టార్ డమ్ అంచనా వేయొచ్చు. ఇప్పుడీ రెండింటినీ పరిగణలోకి తీసుకుంటే బాక్సాఫీస్ రేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ను దాటేశాడు టాలీవుడ్ స్టార్ ప్రభాస్. యూఎస్ లో షారుఖ్ జవాన్ సినిమా బుకింగ్స్ పది రోజుల కిందట ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు 165కె డాలర్స్ ప్రీ సేల్స్ జరగగా…రెండు రోజుల కిందట బుకింగ్స్ మొదలైన సలార్ 200కే డాలర్స్ ప్రీ టికెట్ సేల్స్ తో రికార్డ్ సృష్టిస్తోంది.
యూఎస్ లో జవాన్ 1700కు పైగా షోష్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సలార్ కు 400 కు పైగా షోస్ పడబోతున్నాయి. ఇలా చూసినా షారుఖ్ సినిమాపై సలార్ పై చేయి సాధించింది. సలార్ సినిమా మీద మూవీ లవర్స్, అభిమానుల్లో నెలకొన్న క్రేజ్ ను యూఎస్ ప్రీ సేల్స్ ప్రూవ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 7న షారుఖ్ జవాన్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
షారుఖ్ గత సినిమా పఠాన్ సూపర్ హిట్టయ్యిన నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ కాంబో మూవీ కాబట్టి సలార్ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను డైనోసార్ తో పోల్చినట్లే…అలాంటి ఓపెనింగ్స్ తో సలార్ జర్నీ స్టార్ట్ చేయబోతోంది.