టాలీవుడ్ లో వస్తున్న బిగ్గెస్ట్ కాంబో మూవీ ఎస్ఎస్ఎంబీ 29. దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కలిసి చేయబోతున్న ఈ చిత్రంపై ఎంతో హైప్ నెలకొని ఉంది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. అడ్వెంచర్ యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్ఎస్ఎంబీ 29పై తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ప్రముఖ హాలీవుడ్ కంపెనీ ఈ సినిమాకు కాస్టింగ్ బాధ్యతలు ఇప్పటికే తీసుకోగా…ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటీనటులు భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తన గత సినిమా ఆర్ఆర్ఆర్ లో రే స్టీవెన్ సన్, ఒలీవియా మోరిస్ వంటి విదేశీ నటీనటులను తీసుకున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలోనూ ఫారిన్ యాక్టర్స్ నటించనున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. మహేశ్ బర్త్ డే సందర్భంగా గత నెల 9న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని చెప్పుకున్నా…ముహూర్తం కుదరలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లోగా ఫార్మల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.