“గాంఢీవధారి అర్జున” విజయాన్ని అందించేనా..?

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గాంఢీవధారి అర్జున. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ తేజ్ కు జంటగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య నటించింది. కెరీర్ ప్రారంభం నుంచి వరుణ్ తేజ్ విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ముకుంద, కంచె, లోఫర్… ఇలా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకున్నాడు. అయితే.. ఈమధ్య గని అనే స్టోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు గాంఢీవధారి అర్జున అనే భారీ యాక్షన్ మూవీ చేశాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ది ఘోస్ట్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఏమాత్రం మెప్పించలేదు. దీంతో వరుణ్ తో చేసిన సినిమా పై టెన్షన్ స్టార్ట్ అయ్యింది. వరుణ్ ఇప్పుడు సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ ను ప్రవీణ్ ఎలా కొత్తగా చూపించారు..? అసలు ఈ సినిమా కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 25న గాంఢీవధారి అర్జున విడుదల కానుంది.

వరుణ్ ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. మరి.. ఈ సినిమా అయినా వరుణ్ కి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.