“చంద్రయాన్ 3” సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్న స్టార్స్

ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా స్టార్ హీరోలు, ఫిల్మ్ సెలబ్రిటీస్ ఈ చారిత్రక ఘట్టాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, వరుణ్ తేజ్, దర్శకుడు రాజమౌళి, సాయి ధరమ్ తేజ్, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు, ఎంతోమంది సెలబ్రిటీలు చంద్రయాన్ 3 సక్సెస్ పై ఫ్రౌడ్ గా ఫీలవుతున్నామంటూ ట్వీట్ చేస్తున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించిందని, ఈ చారిత్రక సందర్భంలో వంద కోట్ల భారతీయులతో పాటు తామూ గర్విస్తున్నామంటూ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. చంద్రయాన్ 3లో భాగంగా విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ భాగంపై దిగింది. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని కోట్లాది మంది భారతీయులు వీక్షించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఇతర శాస్త్రవేత్తల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. అమెరికా, రష్యా, చైనాలకు కూడా సాధ్యం కాని విధంగా భారత్ చందమామ దక్షిణ దృవంపై రోవర్ ను దించింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.