రైడ్, రాక్షసుడు సినిమాలతో సక్సెస్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ. మాస్ మహారాజా రవితేజతో ఖిలాడి సినిమాను ఈమధ్య తెరకెక్కించాడు కానీ.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఖిలాడి తర్వాత చాన్నాళ్లు కథ పై వర్క్ చేసిన రమేష్ వర్మ నెక్ట్స్ మూవీ శివోహం అని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. రమేష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. భూల్ భులాయా 2 రీమేక్ రైట్స్ జ్ఞానవేల్ రాజా దగ్గర ఉన్నాయి.
ఈ కథతోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. పూర్తిగా కొత్త పాత్రలు.. కొత్త నేపథ్యం తీసుకుని ఈ కథను డిజైన్ చేశారని సమాచారం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో రాక్షసుడు సినిమా తీసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు కూడా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండతో పాటు నాగచైతన్య, వరుణ్ తేజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో హీరో ఎవరు అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.