శేఖర్ కమ్ముల మూవీకి నాగ్ ఓకే చెప్పారా..? లేదా..?

కోలీవుడ్ హీరో ధనుష్‌, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది. ఆ పాత్రను టాలీవుడ్ కింగ్ నాగార్జునతో చేయించాలనేది శేఖర్ కమ్ముల ప్లాన్. నాగార్జునతో శేఖర్ కమ్ములకు మంచి అనుబంధం ఉంది. అందుచేత శేఖర్ కమ్ముల అడిగితే నాగ్ నో చెప్పరు. సో.. ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పేసినట్టే అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల శేఖర్ కమ్ముల నాగార్జునకు కథ చెప్పారట కానీ.. నాగ్ మాత్రం తన నిర్ణయం ఏంటి అనేది ఇంకా చెప్పలేదట.

విషయం ఏంటంటే.. నాగార్జున ప్రస్తుతం ఓ సినిమాకి ఓకే చెప్పారు. ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ 7 కి హోస్ట్ గా చేయనున్నారు. పైగా ఇప్పుడు నాగార్జున చేస్తుంది 99వ సినిమా. 100వ చిత్రాన్ని భారీగా.. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేయాలి అనుకుంటున్నారు. శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి ఓకే చెబితే అదే నాగ్ 100వ సినిమా అవ్వచ్చు. అందుచేతనే నాగ్ ఆలోచనలో పడ్డారట. ఈ సినిమా చేయాలా..? వద్దా..? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదట. ఓ వారం రోజుల్లో ఈ సినిమా పై క్లారిటీ వస్తుందని సమాచారం. మరి.. నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.