స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న ఓ క్రేజీ మూవీ నుంచి బయటకు వచ్చిందనే వార్తలు ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు స్పందించిన రశ్మిక…కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉండటమే బెటర్ అనే ఎక్స్ ప్రెషన్ తో సమాధానం ఇచ్చింది. ఆమె సినిమా నుంచి బయటకు రావడం నిజమేననే విషయాన్ని ఈ ఎక్స్ ప్రెషన్ నుంచే తీసుకున్నారు నెటిజన్స్. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ మరో హీరోయిన్ తో మొదలవడం అప్పటి రూమర్స్ వట్టి రూమర్స్ కాదని ప్రూవ్ చేసింది.
హీరో నితిన్ తో దర్శకుడు వెంకీ కుడుముల కొత్త సినిమా ప్రారంభించారు. ఇందులో రశ్మికను హీరోయిన్ గా ప్రకటించారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో గతంలో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్టయ్యింది. దాంతో ఈ క్రేజీ కాంబోపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే రశ్మిక ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చింది. రశ్మిక ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నారు.
తాజాగా నితిన్, వెంకీ కుడుముల సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. శ్రీలీలతో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుతున్నారు. దీంతో రశ్మిక ప్లేస్ ను శ్రీలీల దక్కించుకున్నట్లైంది. ఇప్పటికే నితిన్ తో శ్రీలీల ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తోంది.