నాలుగైదేళ్ల కిందట వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు రవితేజ. దర్శకుల విషయంలో కొత్త పాత అనేది చూడలేదు. కథల విషయంలోనూ పెద్దగా పట్టించుకోలేదు. వాటిలో చాలా వరకు ఫ్లాప్స్ అయ్యాయి. రాజా ది గ్రేట్, క్రాక్ వంటి ఒకట్రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ ఒకట్రెండు సినిమాలే రవితేజకు మరో ఐదారేళ్లకు కావాల్సిన ఆఫర్స్ కు గ్యారెంటీ ఇచ్చారు. రవితేజ ప్లాన్ కూడా ఇదే అయి ఉంటుంది. అదిప్పుడు వర్కవుట్ అయ్యింది.
ఆ ప్లాన్ వర్కవుట్ ఫలితమే ఇప్పుడు రవితేజ ఖాతాలో ఉన్న సినిమాలు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ అనే సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకు చేరుకున్నారు. వీటి రిలీజ్ ప్లానింగ్స్ జరుగుతుండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నాడు రవితేజ.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి బిగిన్ కానున్నట్లు సమాచారం. డైరెక్టర్ తో రవితేజకిది నాలుగో సినిమా. ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు వీరి కాంబోలో రాగా…వాటిలో క్రాక్ హిట్టయ్యింది.