అనసూయ హాట్ ఫొటోస్ పోస్ట్ చేయడం, మంచి దుస్తులు వేసుకోమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం, నా లైఫ్ నా ఇష్టం అంటూ మళ్లీ అనసూయ వాళ్లకు రీకౌంటర్స్ వేయడం రెగ్యులర్ గా చూస్తున్నదే. అనసూయ ధైర్యంగా ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇప్పటిదాకా చూశాం. కానీ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్ లో అనసూయ ఏడుస్తూ వీడియో పెట్టడం కలకలం రేపింది. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ తట్టుకోలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుందామె.
ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అనసూయ. గత కొద్ది రోజులుగా ఈ బాధను తాను అనుభవిస్తున్నానని, తన బాధను ట్రోలర్స్ కు తెలిపేందుకే ఈ వీడియో పోస్ట్ చేసినట్లు ఆమె చెప్పుకుంది. ఈ పోస్ట్ లో అనసూయ స్పందిస్తూ – మనుషుల మధ్య దూరాన్ని తగ్గించే సమాచారం షేర్ చేసుకునేందుకు ఉపయోగించాల్సిన సోషల్ మీడియాను ఒకరినొకరు తిట్టుకునేందుకు, ట్రోలింగ్స్ చేసేందుకు, విద్వేషాలు పంచేందుకు వాడుతున్నారు. మీరు ఎదుటివారిపై చేసే వ్యాఖ్యలు వారిని చాలా ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే మీరు ట్రోలింగ్ చేసే ముందు, కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మిగతా వారి పట్ల దయగా ఉండండి. అని పోస్ట్ చేసింది.
ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు చివరలో అనసూయ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం రికార్డ్ చేసిన వీడియోను ఇప్పుడు పోస్ట్ చేసినట్లు ఆమె పేర్కొంది. రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.