ఇండియన్ మూవీ డాటా బేస్ (ఐఎండీబీ)లో మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం సినాప్సిస్ సర్ ప్రైజ్ చేస్తోంది. ఇది క్రెడబిలిటీ ఉన్న సంస్థ కాబట్టి ఇందులో స్థూలంగా రాసిన వన్ లైన్ కథను బిలీవ్ చేయొచ్చు. ఇక ఇందులో ఉన్న సినాప్సిస్ చూస్తే…గుంటూరులో ఒక డాన్ తన నేర సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు. అతని క్రైమ్స్ ను ఓ అందమైన లేడీ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. ఆ జర్నలిస్ట్ హీరోయిన్ అయి ఉండాలి. ఇక ఆ సంగతి తెలుసుకున్న ఆ డాన్ ఆమె అందానికి పడిపోయి ప్రేమిస్తాడు.
డాన్ ప్రేమను హీరోయిన్ ఒప్పుకోదు కాబట్టి కాన్ ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఆమెను కాపాడేెందుకు హీరో ఎంట్రీ…అక్కడి నుంచి అనేక ట్విస్ట్ లతో సాగే కథ. ఇదీ ఐఎండీబీ సినాప్సిస్ ద్వారా తెలిసే ఇన్పర్మేషన్.
ఈ జర్నలిస్ట్ గా శ్రీలీల నటిస్తుంది అనుకుంటే…ఆమెను కాపాడేది హీరో మహేశ్. ఇక ఈ సినాప్సిస్ మొత్తం కథను రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పడానికీ లేదు.
అయితే వన్ లైన్ గా చూస్తే ఓ స్టార్ హీరో కమర్షియల్ ఎంటర్ టైనర్ కు సరిపోయేలా ఉంది. ఇలాంటి అమ్మాయి వర్సెస్ డాన్..మధ్యలో హీరో ఎంట్రీ కథతో ఒక్కడు చూశాం. అది మహేశ్ కెరీర్ లో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ సూపర్ హిట్. హిట్ ఫార్ములా అని త్రివిక్రమ్ కూడా ఇదే ఫాలో కాలేదు కదా. కాకపోవచ్చు.