‘ఖుషి’ హార్ట్ టచింగ్ సాంగ్ ‘యెదకి ఒక గాయం..’ వచ్చేసింది

లెట్స్ సెలబ్రేట్ మ్యూజిక్ అండ్ లవ్ అంటూ ‘ఖుషి’ టీమ్ చెబుతున్న మాటలన్నీ ఆ పాటల రూపంలో ముందుకొస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’లో నుంచి ఒక్కో పాట రిలీజ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ కథా చిత్రాల్లో మ్యూజిక్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ‘ఖుషి’ టీమ్ కు తెలుసు. అందుకే మంచి మెలొడీ పాటల్ని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఏరి కోరి ట్యూన్ చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి లవ్ పెయిన్ తెలిపే ‘యెదకి ఒక గాయం..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యెదకి ఒక గాయం..వదలమంది ప్రాణం ..చెలిమివిడి బంధం..ఎవరు ఇక సొంతం..కలతపడి హృదయం… కరగమంది మౌనం…గతమువిడి పాశం..ఏది ఇక బంధం అంటూ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరపర్చి దివ్య ఎస్ మీనన్ తో కలిసి పాడారు.

పాటలోని సాహిత్యం, సంగీతం ఎంతో అందంగా కలిసిపోయిన ఈ పాట వినగానే మ్యూజిక్ లవర్స్ ను ఫేవరేట్ సాంగ్ గా మారిపోవడం ఖాయం. ఈ పాటలో విజయ్ దేవరకొండ పలికించిన భావోద్వేగాలు కూడా ఆడియెన్స్ కు హార్ట్ టచింగ్ గా ఉండబోతున్నాయి. ‘ఖుషి’ సినిమాను మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.