నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. ఇవాళ రిలీజైన ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ డీటెయిల్స్ రివ్యూలో చూద్దాం.
మన పురాణాల్లో వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయలు శ్రీమహా విష్ణుకు గొప్ప భక్తులు. శ్రీమహా విష్ణు ఏడు జన్మలు ఎత్తే కాలంలో తాము ఆయన్ను విడిచి ఉండలేమని, కనీసం రాక్షసులుగానైనా పుట్టించి ఆయనను చూసే భాగ్యం కల్పించమని కోరతారు. అలా శ్రీమహా విష్ణు వరం ఇచ్చిన మీదట సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో రాక్షసులుగా పుడతారు జయ విజయలు. వారే కలియుగంలో కూడా పుడితే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్ తో దర్శకుడు శ్రీమాన్ కీర్తి రాక్షస కావ్యం చిత్రాన్ని రూపొందించారు.
ఈ రెండు పాత్రల్లో క్రూరమైన రౌడీలుగా నవీన్, అన్వేష్ మైఖేల్ ఆకట్టుకునేలా నటించారు. యాక్షన్, ఎమోషన్ కంటెంట్ తో టీజర్ మొత్తం రా అండ్ రస్టిక్ గా సాగింది. విలన్ లకు అన్యాయం అవుతది అనే డైలాగ్ తో టీజర్ ముగిసింది. విలన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో రాక్షస కావ్యం కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చివరలో ఒక మంచి ట్విస్ట్ తో సినిమా ముగుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ఆ ట్విస్ట్ ఏంటో థియేటర్ లో చూడాలి. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.