మైక్ మూవీస్ బ్యానర్ పై డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల. వారి కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లోనూ మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. సోహైల్, రూపా కొడవాయుర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ కానుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు మైక్ మూవీస్ ప్రొడ్యూసర్స్.
తమ సంస్థలో నిర్మించే ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటామని ఈ ఇంటర్వ్యూలో అన్నారు నిర్మాత అప్పిరెడ్డి. మదర్ సెంటిమెంట్ కథ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా బాగా నచ్చుతుందని ఆయన చెప్పారు. ఇలాంటి సబ్జెక్ట్ రిస్క్ అని ఫ్రెండ్స్ చెప్పినా కథలోని కొత్తదనాన్ని నమ్మి చేశామని అప్పిరెడ్డి తెలిపారు. తమ సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉందనీ…అయితే వాళ్లను ఒక స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టమని అప్పిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకవేళ స్టార్ హీరోలకు మన కథ నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలని.. మన దగ్గర నచ్చిన స్క్రిప్ట్ ఉన్నప్పుడు వెయిట్ చేయడం కంటే ఆ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే బెటరని అప్పిరెడ్డి చెప్పారు. అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తామని ఆయన అన్నారు.
మేకింగ్ లో బడ్జెట్ వేస్టేజ్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తామని అన్నారు మరో ప్రొడ్యూసర్ వెంకట్ అన్నపరెడ్డి. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నామని, అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను ఇంప్రెసివ్ గా చూపించిన సోహైల్ ఈ కథకు బాగుంటాడని సెలెక్ట్ చేశామని అన్నారు. అతను మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడని వెంకట్ అన్నపరెడ్డి తెలిపారు.
నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం మంచి బజ్ తీసుకొచ్చిందని అన్నారు నిర్మాత రవీందర్ రెడ్డి సజ్జల. మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ కు రెస్పాన్స్ బాగుండటంతో మూవీ మీద క్యూరియాసిటీ ఏర్పడిందన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి కథతో తెలుగులో మూవీ రాలేదని రవీందర్ రెడ్డి చెప్పారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ యూనిక్ గా ఉంటుందని. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆయన అన్నారు.