తన కెరీర్ లో ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లరు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఆయనది ఒకరకంగా మచ్చలేని కెరీర్. ఏ కాంట్రవర్సీ లేని అక్షయ్ విమర్శలకు గురయ్యేది ఒక సిటిజన్ షిప్ విషయంలోనే. కెనడా పౌరసత్వం తీసుకోవడమే ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అంటుంటారు విమర్శకులు. దీనికి చెక్ పెట్టేందుకు అక్షయ్ భారత పౌరసత్వం తీసుకున్నారు. ఇవాళ ఆయన చేతికి ఇండియన్ సిటిజన్ షిప్ డాక్యుమెంట్స్ అందాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అక్షయ్.
ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ స్పందిస్తూ…నా మనసు, పౌరసత్వం రెండూ ఇండియన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్ అంటూ ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఓ మై గాడ్ 2 సూపర్ హిట్టయ్యింది. గత కొంతకాలంగా ఆయనను వేధిస్తున్న ఫెయిల్యూర్స్ నుంచి ఈ సినిమా రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం అక్షయ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.