“ఓజీ” షూటింగ్ కు పవన్ గ్రీన్ సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఓజీ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఈ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. పవన్ అందుబాటులో లేనప్పుడు మిగతా ఆర్టిస్టుల కాంబో సీన్స్ రూపొందించారు. పవన్ తో పనిలేని ప్రతి వర్క్ కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు పవన్ వస్తే గానీ ఓజీ కంప్లీట్ అయ్యేలా లేదు.

పవన్ కు ఈ విషయం మేకర్స్ చెప్పగా..ఆయన మే నుంచి షూటింగ్ కు వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో టీమ్ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. మే నుంచి పవన్ సెట్ లో అడుగుపెడితే సెప్టెంబర్ రిలీజ్ కు రావొచ్చు అనేది ఓజీ మేకర్స్ ఆలోచన. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఆ రోజు ఓజీ రిలీజైతే ఫ్యాన్స్ కు పండగే. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు.