పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఓజీ. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ లో ఓజీ రావడం లేదని.. ఏప్రిల్ లేదా జూన్ లో ఓజీ సినిమా థియేటర్లోకి రానుందని టాక్ వినిపిస్తోంది.
ఓజీ ఏప్రిల్ లేదా జూన్ కి వెళ్లడంతో… ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓజీ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారట పవర్ స్టార్. హరీష్ శంకర్ ఉస్తాద్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని.. త్వరలో షూటింగ్ డీటైల్స్ తెలియచేయనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.