సమంత రెస్పాన్స్ కు అర్థమేంటో

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్ సమంత. తన ఫీలింగ్స్ ను సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడిస్తుంటుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న భార్యలను భర్తలు వదిలేస్తున్నారు, కానీ భర్తలకు బాగా లేకుంటే భార్యలు వారిని దగ్గరుండి చూసుకుంటున్నారు అనే అంశంపై జరిగిన సర్వే ఒకటి సమంతకు బాగా నచ్చింది. ఈ సర్వే సంస్థ చేసిన పోస్ట్ ను సమంత లైక్ చేసింది. సమంత ఇలా రెస్పాండ్ కావడానికి అర్థమేంటని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

సమంత మయోసైటిస్ అనే అనారోగ్యం బారిన పడింది. అంతకు ఏడాది ముందే నాగచైతన్యతో విడిపోయింది. ఈ పోస్ట్ ను లైక్ చేయడం ద్వారా సమంత తన జీవితంలోనూ ఇలాగే జరిగిందని చెప్పాలనుకుంటోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైవాహిక బంధం నుంచి విడిపోయిన తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టింది సమంత. నాయికగా కొనసాగుతూనే ప్రొడ్యూసర్ మారింది. ఆమె ప్రొడక్షన్ లో కొత్త నటీనటులతో శుభం అనే మూవీ నిర్మించింది సమంత. ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రాబోతోంది.