భారీగా పెరుగుతున్న “విశ్వంభర” బడ్జెట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. త్రిష హీరోయిన్ కాగా, అషికా రంగనాథ్ మరో కీ రోల్ చేస్తోంది. వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ కు భారీగా ఖర్చుపెడుతున్నారట మేకర్స్. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ లో సీజీ వర్క్ పై విమర్శలు వచ్చాయి. దీంతో మరింత క్వాలిటీగా గ్రాఫిక్స్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో విశ్వంభర బడ్జెట్ మరింతగా పెరుగుతోందని తెలుస్తోంది. ఈ సీజీ వర్క్ కే దాదాపు 70 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట మేకర్స్. ఆడియెన్స్ కు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే రిలీజ్ ఆలస్యమైనా క్వాలిటీలో కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.