రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ అవార్డ్ అందుకున్న యంగ్ హీరో

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో ప్రెస్టీజియస్ అవార్డ్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)లో రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ అవార్డ్ అందించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం మెల్ బోర్న్ లో ఘనంగా జరిగింది.

ఇటీవల వరుస సక్సెస్ అందుకుంటున్నారీ హీరో. ఆయన నటించిన భూల్ భులయ్యా 2, సత్య ప్రేమ్ కి కథ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. దీంతో కార్తీక్ ఆర్యన్ క్రేజీ హీరోగా మారారు. ఈ క్రమంలో ఆడియెన్స్ రివార్డులతో ఇంటర్నేషనల్ అవార్డ్స్ దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చందూ చాంపియన్ అనే సినిమాలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా కథతో దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.