కన్నడ ఎంట్రీకి రెడీ అయిన పూజా

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది. తమిళంలోనూ పేరున్న హీరోలతో కలిసి నటించింది. ఇప్పుడీ నాయిక కన్నడలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న బీఆర్ బీ (బిల్లా రంగా భాషా) చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. దీంతో సౌత్ లో మరో బిగ్ ఇండస్ట్రీలో తన లక్ టెస్ట్ చేసుకోనుంది పూజా హెగ్డే.

ప్రస్తుతం సూర్య సరసన పూజా నటించిన రెట్రో మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పూజా బిజీగా ఉంది. ఆమె తన కెరీర్ గురించి ఈ ఇంటర్వ్యూస్ లో చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెట్రో హీరోయిన్ గా తన పర్ ఫార్మెన్స్ కు గుర్తింపు తీసుకొస్తుందని ఆమె ఆశిస్తోంది. ఈ సినిమా మే 1న థియేట్రికల్ రిలీజ్ కు రానుంది.