ఎస్ఎస్ఎంబీ 29- భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మూడో షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. నగరంలో వేసిన భారీ సెట్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మహేశ్ బాబు కాంబోలో యాక్షన్ సీక్వెన్సు తెరకెక్కిస్తున్నారు.

3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ కోసమే ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ లో ఉంటోంది. మహేశ్ కుటుంబంతో ప్రియాంక భర్త నిక్ జోనాస్ తీసుకున్న పిక్స్ ఇటీవల వైరల్ అయ్యాయి. ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.