మహేశ్ సినిమాల రీ రిలీజ్ జాతర

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల రి రిలీజ్ ల జాతర మొదలుకానుంది. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల దాకా మహేశ్ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రీ రిలీజ్ లో మహేశ్ సినిమాలు బాగా వసూళ్లు చేస్తుంటాయి. దీంతో ఆయన సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ రీ రిలీజ్ లపై ఆసక్తి చూపిస్తున్నారు.

మహేశ్ బాబు అతిథి, భరత్ అనే నేను, ఖలేజా సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నెల 26న భరత్ అనే నేను, మే 30న ఖలేజా, 31వ తేదీన అతిథి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముందుగా రీ రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను సినిమాకు బుకింగ్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నేపథ్యంలో మహేశ్ సినిమాల రి రిలీజ్ థియేటర్స్ లో అభిమానుల సందడి కనిపించనుంది.