సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో సినిమా ట్రైలర్ రిలీజైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్య రెట్రోకు ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మే 1న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన రెట్రో ట్రైలర్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది.
అమాయకుడు తిరగబడితే ఎలా ఉంటుందో సూర్య రెట్రోలో చూపించారు. మొదట విలన్స్ కు భయపడే హీరో, ఆ తర్వాత వారి వీక్ నెస్ తెలుసుకుని రివేంజ్ తీర్చుకునే తీరు రెట్రో ట్రైలర్ లో ఆకట్టుకుంది. సాధారణంగా ట్రైలర్ లో హీరో సీన్స్ ఎక్కువగా చూపిస్తారు, కానీ రెట్రో ట్రైలర్ లో లీడ్ యాక్టర్స్ అందరినీ పరిచయం చేశారు. హీరోయిన్ గా పూజా హెగ్డేకు పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. పారి అనే క్యారెక్టర్ లో సూర్య ఓవరాల్ పర్ ఫార్మెన్స్ చేశారు. సూర్య చేసిన స్టైలిష్ యాక్షన్ ఈ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. శ్రియా సరన్ స్పెషల్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది.