ఈసారి లేట్ కాదట…!

టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఎస్ఎస్ఎంబీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజమౌళి సినిమాలకు ఎక్కువ టైమ్ పడుతుంటుంది. అందుకున్న భిన్నమైన అప్రోచ్ తో ఎస్ఎస్ఎంబీ 29ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను కంప్లీట్ చేసే ప్లాన్ లో డైరెక్టర్ రాజమౌళి ఉన్నారట.

అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఆలస్యం లేకుండా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్ పూర్తవగా..ఇప్పుడు మూడో షెడ్యూల్ చిత్రీకరణలో ఉన్నారు. ఇప్పటిదాకా ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు కానీ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు టీమ్. ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమార్ కీ రోల్స్ చేస్తున్నారు.