ఇక ఈ స్వాగ్ లు వద్దు…మెగాస్టార్ మీద ప్రెషర్ పెరుగుతోందా

తను స్టార్ గా ఎదిగినప్పటి నుంచి కమర్షియల్ సినిమాలే చేస్తూ వస్తున్నారు మెగాస్టార చిరంజీవి. ఆయన ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది చాలా చాలా తక్కువ. అటు తమిళంలో రజనీకాంత్ కూడా పూర్తిగా కమర్షియల్ మాస్ సినిమాలే చేసేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు సినిమాలను చూసే తీరు మారింది. ఓటీటీల వల్ల వెరీటీ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. కరోనా తర్వాత బాక్సాఫీస్ కొత్త లెక్కలు నేర్చుకుంది. మరి ఈ మార్పులన్నీ మెగాస్టార్ లాంటి వాళ్లూ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వాగ్, స్టైల్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ తన ఓల్డ్ స్టైల్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన రీఎంట్రీ నుంచి ఇలా చేసిన ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అవలేదు. గాడ్ ఫాదర్ సినిమాలో కొంత డిఫెరంట్ గా ట్రై చేశారు అది ఆదరణ పొందింది.

ఇక మళ్లీ ఇప్పుడు భోళా శంకర్ తో చేసిన మాస్ ఎంటర్ టైనర్ ప్రయత్నం బెడిసింది. తమన్నా లాంటి హీరోయిన్స్ తో చిరంజీవి డ్యూయెట్స్, శ్రీముఖితో చేసే ఖుషి సీన్స్…అదే పాత డాన్ క్యారెక్టర్స్…ఇవన్నీ ప్రేక్షకులకు ఏమాత్రం కొత్తదనం పంచడం లేదు. మరోవైపు యాక్షన్ జానర్ లోనే కొత్త వరల్డ్స్ క్రియేట్ చేస్తున్నారు దర్శకులు. అలాంటి సీరియస్ ఫిలింస్ మెగాస్టార్ చేస్తే బాగుంటుందనే ఒత్తిడి ఇప్పుడు మొదలైందని అనుకోవచ్చు. ఇక ఈ స్వాగ్ లు పక్కనపెట్టేసి..చిరు కూడా పునరాలోచనలో పడితే బెటర్.