హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా శుభం. ఈ చిత్రాన్ని సమంత ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ కథతో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల రూపొందించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం కీలక పాత్రల్లో నటిస్తున్న శుభం సినిమా రిలీజ్ డేట్ ను సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మే 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
ఇదే డేట్ కు పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కు రావాల్సిఉంది. పవన్ సినిమాతో సమంత శుభం సినిమాకు ఏమాత్రం పోటీ లేదు. ఎందుకంటే శుభం సినిమా పూర్తిగా కొత్త వాళ్లతో నిర్మించింది. అయితే పవన్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందనే క్లారిటీ రావడం లేదు. సమంత ఇందుకే హరి హర డేట్ హైజాక్ చేసి తన సినిమా రిలీజ్ చేసుకునే సాహసం చేసిందా అనే టాక్ మొదలైంది.