విక్రమ్ హీరోగా నటించి-న వీర ధీర శూరన్ 2 సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్స్ లో రిలీజైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ కావడం సర్ ప్రైజ్ చేస్తోంది. గత నెల 27న వీర ధీర శూరన్ 2 సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు దక్కలేదు.
ఈ నెల 24వ తేదీ నుంచి వీర ధీర శూరన్ 2 సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా అమోజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. వీర ధీర శూరన్ 2 సినిమాకు ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. దుషారా విజయన్ హీరోయిన్ గా నటించింది. రెండు పార్టుల ఈ సినిమాను ఫస్ట్ సెకండ్ పార్ట్ వీర ధీర శూరన్ 2 రిలీజ్ చేశారు.