ఈ వారం రెండు మూవీస్ ఢమాల్

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగులుతోంది. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఓదెల 2, ఈరోజు రిలీజైన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలకు హిట్ టాక్ రాలేదు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 సినిమా అరుంధతి, అఖండ ఫార్మేట్ ఫాలో అయ్యిందని, సినిమా పెద్దగా ఎగ్జైట్ చేయలేదని టాక్ వచ్చింది. సినిమా చాలా బాగుందంటేనే కలెక్షన్స్ దక్కే ట్రెండ్ ఇది. ఇలాంటి టైమ్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాకు ప్రేక్షకులు రావడం కష్టమే.

ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన కల్యాణ్ రామ్, విజయశాంతి అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ తో పాటు ఆడియెన్స్ కూడా రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే చెబుతున్నారు. కొన్ని యాక్షన్ బ్లాక్స్ వరకు మూవీ బాగుందని మిగతా ఆకట్టుకోలేదని సినిమా చూసిన వారు అంటున్నారు. సమ్మర్ హాలీడేస్ కు అడ్వాంటేజ్ అవుతుందని ఈ రెండు చిత్రాలు రిలీజ్ కు రాగా..వాటి టార్గెట్ మిస్ అయ్యిందనే చెప్పాలి.