“డ్రాగన్” భారీ షెడ్యూల్ కు ఎన్టీఆర్ రెడీ

ఎన్టీఆర్ లైనప్ లో ఆసక్తి కలిగిస్తున్న సినిమా డ్రాగన్. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ లేకుండా ప్రారంభించారు. ఎన్టీఆర్ ఈ సినిమా సెట్ లో వచ్చే మంగళవారం నుంచి జాయిన్ కాబోతున్నారు.

మూడు వారాల పాటు సాగే భారీ షెడ్యూల్ తో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల రెండోవారం దాకా ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో నటించనున్నారు. హ్యూజ్ యాక్షన్ సీక్వెన్సులను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. డ్రాగన్ లోనూ అలాంటి గూస్ బంప్స్ తెప్పించే స్టంట్స్ ఉంటాయని తెలుస్తోంది.