ఓటీటీలోకి వచ్చేస్తున్న “రాబిన్ హుడ్”

నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను జీ5 స్ట్రీమింగ్ చేయనుంది. మే 2న రాబిన్ హుడ్ జీ 5లో ప్రీమియర్ కాబోతోంది. గత నెల 28న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజైంది. హై ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి వచ్చిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కేతిక శర్మ ఐటెం సాంగ్, డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ వంటి మెరుపులు ఉన్నా, ఈ సినిమాను నిలబెట్టలేకపోయాయి.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను రూపొందించాడు. వెంకీ కుడుముల గత రెండు చిత్రాలు ఛలో, భీష్మ మంచి సక్సెస్ కావడంతో రాబిన్ హుడ్ కూడా ఎంటర్ టైన్ చేస్తుందని అంతా ఆశించారు. జీ5 లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని టీమ్ ఆశిస్తున్నారు.