“కిల్లర్” సినిమాతో ఒక ఆథెంటిక్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ పూర్వాజ్. టైటిల్, ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమా మూవీ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. “కిల్లర్” సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్న డైరెక్టర్ పూర్వాజ్ ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు. ఈ నెల 30న “కిల్లర్” సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. “కిల్లర్” మూవీ గ్లింప్స్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
“కిల్లర్” చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్, దశరథ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం “కిల్లర్” మూవీకి సంబంధించిన ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.