సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా జైలర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందీ సినిమా.
రజనీకాంత్ కి చాలా కాలం తర్వాత ఓ సాలిడ్ హిట్ ను అందించిన మూవీగా జైలర్ ను చెబుతున్నారు. ఈ సినిమాకు ముందు వరుస అపజయాలతో రజనీ సూపర్ స్టార్ స్టార్ డమ్ బీటలు వారుతున్నాయని మీడియా కూడా స్పెషల్ స్టోరీస్ చేసే పరిస్థితి ఉండేది.
జైలర్ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా 3.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ మార్కుకు చేరుకోవడం రజనీ అభిమానులు సంతోషపడేలా చేస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ సినిమాను రూపొందించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ హవా కొనసాగుతోంది.