నిన్న లైంగిక వేధింపులు, నేడు డ్రగ్స్ కేసు

దసరా నటుడు షైన్ టామ్ చాకో రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల హీరోయిన్ విస్సీ సోనీ తనను షైన్ టామ్ చాకో లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేయడం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం కలిగించింది. దీనిపై మలయాళ నటీనటుల సంఘంతో పాటు అక్కడి ఫిలింఛాంబర్ లోనూ విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ తీసుకుని తనను లైంగికంగా వేధించాడని షైన్ టామ్ చాకోపై విన్సీ సోనీ తన కంప్లైంట్ లో పేర్కొంది.

తాజాగా కేరళలోని ఓ హోటల్లో డ్రగ్స్ పార్టీలో నటుడు షైన్ టామ్ చాకో పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ హోటల్ పై రైడ్ చేస్తున్న టైమ్ లో ఈ నటుడు తన గది నుంచి పారిపోయాడు. ఈ డ్రగ్స్ పార్టీలో నటుడు షైన్ టామ్ చాకో పాల్గొన్నాడా లేదా అనే విషయంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మలయాళం, తెలుగుతో పాటు తమిళంలోనూ పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు షైన్ టామ్.