పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ అయినప్పటికీ.. లేట్ అవుతుందని తప్పుకోవడంతో ఆ బాధ్యతలను జ్యోతికృష్ణకు అప్పగించారు. మే 9న వీరమల్లు అని అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో వీరమల్లు వస్తుందా వాయిదాపడనుందా అనేది ఆసక్తిగా మారింది.
ఈ సారి వీరమల్లు రిలీజ్ కాకపోతే ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేస్తామని.. లేదా ఇస్తామన్నా అమౌంట్ లో 50 శాతం అమౌంట్ మాత్రమే ఇస్తామని చెప్పారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు తెలియచేశారని వార్తలు వస్తున్నాయి. త్వరలో పవన్ వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ లెక్కన మే 9న వీరమల్లు రావడం ఖాయం అని టాక్. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కూడా పవన్ తో స్టార్ట్ చేస్తారట. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చేయకూడదు..హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలగా టీమ్ ఉన్నారనితెలుస్తోంది.