వచ్చే ఏడాదంతా పవన్ జాతరే

ఇటీవలే ‘బ్రో’ అవతారంలో అభిమానులను సంతోషపెట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక ఈ ఏడాది పవన్ సినిమాలేవీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ నెక్ట్ ఇయర్ రిలీజ్ షెడ్యూల్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పవన్ ఖాతాలో మూడు చిత్రాలున్నాయి.

పవర్ స్టార్ హీరోగా ప్రస్తుతం సెట్స్ మీద హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలున్నాయి. ఈ సినిమాల్లో హరి హర వీరమల్లు షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుండగా…అతి తక్కువ టైమ్ లో ఎక్కువ పార్ట్ షూటింగ్ చేసుకుంది ఓజీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఒకట్రెండు షెడ్యూల్స్ జరుపుకున్నా…ఇంకా మేజర్ పార్ట్ షూటింగ్ మిగిలే ఉంది.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టాండర్డ్స్ లో సినిమాలు ఉండాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకుంటున్నారు కాబట్టి షూటింగ్ మాత్రమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ కూ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఈ మూడు సినిమాలు షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యేందుకు ఎక్కువ టైమ్ పట్టేలా ఉంది. ఈ ఏడాది చివరలో రిలీజ్ చేస్తారని ఆశించిన ఓజీ నెక్ట్ ఇయర్ సమ్మర్ కు వెళ్లింది.

ఇప్పుడున్న సిట్యువేషన్ ప్రకారం హరిహర, ఉస్తాద్, ఓజీ మూడు సినిమాలు నెక్ట్ ఇయర్ సీజన్ కొకటి చొప్పున రిలీజ్ కాబోతున్నాయి. ఇలా చూస్తే వచ్చే ఏడాదంతా బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ మేనియానే ఉండబోతోంది.