స్టార్ హీరో నాగార్జున తన కొత్త మూవీని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 29న ఆయన బర్త్ డే సందర్భంగా తన కొత్త చిత్రాన్నిప్రకటిస్తారని తెలుస్తోంది. నాగార్జున తన ఘోస్ట్ సినిమా తర్వాత షూటింగ్స్ నుంచి విరామం తీసుకున్నారు. కొత్త సినిమాకు బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతున్నా…ఆ వివరాలు ఇప్పటిదాకా అఫీషియల్ గా ప్రకటించలేదు.
ఓ మలయాళ సినిమా రీమేక్ లో నాగార్జున నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ నెల 29న అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు ప్రసన్నకుమార్ స్క్రిప్ట్ అందిస్తుండగా..కొత్త దర్శకుడు బాధ్యతలు తీసుకుంటాడని అంటున్నారు. ప్రసన్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని ముందు అనుకున్నా..అందుకు నాగార్జున సుముఖంగా లేడని సమాచారం.
ఇక ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాలో నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. సినిమాలు కాకుండా తన ఫేమస్ ప్రోగ్రాం బిగ్ బాస్ కంటిన్యూ చేస్తున్నారు నాగార్జున.