రశ్మికకు అదొక పెద్ద సెంటిమెంట్ అట

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్, నమ్మకాలు లేకుండా ఏ పనులూ జరగవు. లక్ ఫ్యాక్టర్ హీరోయిన్స్ కు మరీ ఎక్కువగా ఆపాదిస్తుంటారు. సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది హీరోయిన్ ఆ ఎఫెక్ట్ హీరోయిన్ మీదకు ఎక్కువగానే వస్తుంటుంది. ఇలాంటి సెంటిమెంట్స్ తనకూ ఉన్నాయని అంటోంది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న.

ప్రస్తుతం రశ్మిక అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ జోడీగా యానిమల్ చిత్రంలో నటిస్తోంది. యానిమల్ సినిమా గురించి రశ్మిక మాట్లాడుతూ – డిసెంబర్ నాకు లక్కీ మంత్. ఈ నెలలోనే నా తొలి సినిమా కిరిక్ పార్టీ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత సినిమాలు కూడా డిసెంబర్ లోనే రిలీజై సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు యానిమల్ కూడా అదే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నా. అని చెప్పింది.

పుష్ప నార్త్ లో రిలీజైనప్పుడు రశ్మికకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో బాలీవుడ్ ఆఫర్స్ పెరిగాయి. అయితే ఇప్పటిదాకా రశ్మికకు సాలిడ్ బాలీవుడ్ హిట్ దక్కలేదు. యానిమల్ సినిమాతో అలాంటి బ్రేక్ ను ఆశిస్తోంది రశ్మిక.