హారర్, డివోషనల్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిన సినిమా ఓదెల 2. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ నంది స్క్రిప్ట్ అందించారు. ఈ నెల 17న ఓదెల 2 రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఓదెల 2 ట్రైలర్ లో ఓదెల గ్రామంలో ఓ దుష్టశక్తి చేస్తున్న భీభత్సాన్ని చూపించారు. ఆ దుష్ట శక్తిని అంతం చేసేందుకు శివ భక్తురాలైన తమన్నా ఊరిలోకి అడుగుపెడుతుంది. ఆమెను ఊరిలోకి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు కొందరు. ఎవరి ఊహకు అందనంత క్రూరంగా ప్రవర్తిస్తున్న ఆ దుష్టశక్తితో శివ శక్తి అయిన తమన్నా చేసిన పోరాటాన్ని రక్తసిక్తంగా చూపించారు. మొత్తం ట్రైలర్ లో వావ్ అనే మూవ్ మెంట్ ఒక్కటి కూడా లేదు. దుష్ట శక్తి పాత్రలో వశిష్ట ఎన్ సింహ నటించారు. గతంలో బాలకృష్ణ లాంటి మాస్ హీరో చేసినటువంటి పాత్రను తమన్నా ఎంతవరకు మెప్పిస్తుంది అనేది థియేటర్స్ లో చూడాలి.