అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అనౌన్స్ వచ్చేసింది. ఏఏ 22గా ఈ సినిమాను పిలుస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఇది గ్లోబల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.
సన్ పిక్చర్స్ ఆఫీస్ లో అల్లు అర్జున్, అట్లీ, కళానిధి మారన్ మీట్ అయిన తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్, అట్లీ లాస్ ఏంజెలీస్ వెళ్లారు. అక్కడ ఫిలిం స్టూడియోస్ సందర్శించి, పలు సూపర్ హిట్ హాలీవుడ్ మూవీస్ కు పనిచేసిన టెక్నీషియన్స్ తో మాట్లాడారు. వీఎఫ్ఎక్స్, మేకింగ్ పరంగా ఏఏ 22 గ్లోబల్ రేంజ్ లో ఉంటుందని ఈ వీడియోతో తెలుస్తోంది.