డైరెక్టర్ త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత ఇంత వరకు నెక్ట్స్ మూవీని ప్రకటించలేదు. గుంటూరు కారం రిలీజై సంవత్సరం దాటేసింది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వర్క్ గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. అయితే.. అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీని ఈరోజు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎంత ఫాస్ట్ గా చేయలి అనుకున్నా కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చు.
అప్పటి వరకు త్రివిక్రమ్ వెయిట్ చేయడం కష్టం. అందుకనే అట్లీతో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ తో మూవీని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారని ఇటీవల నాగవంశీ చెప్పాడు. అయినా అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్రివిక్రమ్ అప్పటి వరకు వెయిట్ చేయకుండా.. వేరే హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. ఈ లిస్టులో పలువురు యంగ్ స్టార్ హీరోలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఒక మెట్టు దిగి ఈ యంగ్ స్టార్స్ తో సినిమా చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.