సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అల్లు అర్జున్ ట్రెండ్ అవుతున్నారు. ఈరోజు ఆయన బర్త్ డే. ఇండస్ట్రీలోని ప్రముఖులు, అల్లు అర్జున్ స్నేహితులు ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ఆయన బర్త్ డే డీపీలు వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకున్నారు.
భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రోజు అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, సన్ పిక్చర్స్ కాంబో మూవీ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ పై ఆసక్తి నెలకొంది. సౌత్ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ కాంబో మూవీగా ఈ ప్రాజెక్ట్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.