“ఎల్లమ్మ” సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడంటే?

బలగం అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించిన దర్శకుడు వేణు. ఆ తర్వాత ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ముందుగా ఈ కథ నాని, విశ్వక్ సేన్ ల దగ్గరకు వెళ్లింది. వాళ్లతో ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇప్పుడు నితిన్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఆగింది. హీరో సెట్ అయిన తర్వాత హీరోయిన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. సాయిపల్లవి అనుకున్నారు కానీ.. ఇక్కడ కూడా డేట్స్ ప్రాబ్లమ్స్ వల్ల సెట్ కాలేదు.

ఆ తర్వాత కీర్తి సురేష్‌ ను కాంటాక్ట్ చేస్తే.. ఓకే చెప్పింది. ప్రస్తుతం ఎల్లమ్మ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా కోసం వేణు.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నాట‌క సంఘాలు, అక్క‌డి న‌టీన‌టుల్ని క‌లుస్తున్నాడట. నాటకాలకు సంబంధించి ఓ అంశం ఉందట. అందుకోసం రంగస్థలం కళాకారుల్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. బలగం చిత్రాన్ని చిన్న సినిమాగా తీసినా ఎల్లమ్మ చిత్రాన్ని మాత్రం భారీ బడ్జెట్ మూవీగా రూపొందిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని తెలిసింది.