హీరోయిన్ సమంత ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పేరుతో తన సొంత ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఈ సంస్థలో తొలి ప్రయత్నంగా ‘శుభం’ అనే మూవీ నిర్మించింది. హారర్ కామెడీ కథతో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం కీలక పాత్రల్లో నటిస్తున్న శుభం సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. సమంత తాజాగా శుభం సినిమాపై ఓ పోస్ట్ చేసింది.
చిన్న వాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమాను ఆదరించాలని ఆ పోస్ట్ లో కోరింది సమంత. శుభం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ప్రొడక్షన్ సైడ్ తాను చేస్తున్న ఈ జర్నీలో శుభం సినిమా మంచి బిగినింగ్ ఇస్తుందని సమంత పేర్కొంది. ఈ పోస్ట్ తో సమంత ప్రొడ్యూసర్ గా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా తన కెరీర్ కొనసాగించాలని సమంత ఆలోచిస్తోందని అనుకోవచ్చు.