డైరెక్టర్ హరీశ్ శంకర్ కెరీర్ లో లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తోంది. మిస్టర్ బచ్చన్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దగ్గరకు ప్రొడ్యూసర్స్, స్టార్ హీరోలు వస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిందే. హరీశ్ శంకర్ సినిమాల బాక్సాఫీస్ సక్సెస్ కు ఆయనకు వస్తున్న అవకాశాలకు సంబంధమే లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైనప్ చేస్తున్నాడు హరీశ్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేనితో కలిసి ఈ డైరెక్టర్ కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో రీసెంట్ గా మీటింగ్ జరిగింది.
ఈ కాంబోలో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా హరీశ్ కెరీర్ లో భారీ ప్రాజెక్ట్ కానుంది. మరోవైపు బాలకృష్ణ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సినిమా చేయనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనూ హరీశ్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తారని తెలుస్తోంది. ఇలా మూడు బిగ్ మూవీస్ లైనప్ చేశారు డైరెక్టర్ హరీశ్ శంకర్.