ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర ఇప్పుడు జపాన్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఎన్టీఆర్, కొరటాల జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు. అక్కడ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అక్కడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ ఎన్టీఆర్ గురించి.. సాగరసంగమం సినిమా రీమేక్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తెలుగు లెజండరీ డైరెక్టర్ విశ్వనాథ్ సాగరసంగమం సినిమా చేశారు. ఆ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. దర్శకులు అందరికీ ఆ సినిమా చాలా ఇష్టం. అందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేస్తే.. ఆ పాత్రలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే నటించగలగడు అని కొరటాల శివ చెప్పాడు. సాగరసంగమం గురించి, ఎన్టీఆర్ గురించి కొరటాల చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 లో నటిస్తున్నాడు. కొరటాల దేవర 2 కథపై కసరత్తు చేస్తున్నాడు.